ఇజ్రాయెల్ దాడుల్లో 50 మంది బందీల మృతి

  • ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య మరింత ముదిరిన యుద్ధం
  • ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 7,028 మంది మృతి
  • వెస్ట్‌బ్యాంకులో 60 మంది పాలస్తీనియన్లను అదుపులోకి తీసుకున్న ఇజ్రాయెల్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. గాజాను సర్వనాశనం చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని భీష్మించుకున్న ఇజ్రాయెల్ తమ దళాలకు గాజాపై భూతల దాడికి సిగ్నల్స్ ఇచ్చింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు..

* ఇజ్రాయెల్ సరిహద్దు సమీపంలోని ఈజిప్టు పట్టణాన్ని ఇజ్రాయెల్ మిసైల్ తాకిన ఘటనలో 50 మంది బందీలు మరణించినట్టు హమాస్ తెలిపింది.
* ఇజ్రాయెల్-లెబనాన్-సిరియా మధ్య సీమాంతర పోరు కూడా జరుగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 
* ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 7,028 మంది చనిపోయినట్టు గాజాలోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 
* వెస్ట్‌బ్యాంక్‌లో రాతంత్రా జరిపిన దాడుల్లో 60 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ అరెస్ట్ చేసింది. తూర్పు జెరూసెలంతో వేరేగా జరిపిన దాడుల్లో మరింత మంది అరెస్ట్ అయినట్టు ‘అల్ జజీరా’ పేర్కొంది.
*యుద్ధం ఇప్పట్లో ఆగే సంకేతాలు కనిపించకపోవడంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. 
* పాలస్తీనా ప్రజల ప్రాణాలు రక్షించేందుకు అవసరమైన సామగ్రిని సరఫరా చేసేందుకు అనుమతించాలని ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తీసుకొస్తోంది. 
* ఇరాన్ తన గడ్డపై 500 మంది హమాస్, ఇస్లామిక్ జిహాదీలకు శిక్షణ ఇస్తున్నట్టు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ తెలిపింది.


More Telugu News