ఇంగ్లండ్ దుస్థితికి కారణం ఆ ఆలోచనే: వీరేంద్ర సెహ్వాగ్

  • శ్రీలంకతో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఘోర పరాజయం
  • కనుమరుగవుతున్న ‘సెమీస్’ అవకాశాలు
  • ఇంగ్లండ్ పేలవ ప్రదర్శనకు కారణాలు చెప్పిన సెహ్వాగ్ 
  • జట్టులో తరచూ మార్పులు,చేర్పులు దీనికి కారణమని ‘ఎక్స్’ వేదికగా వెల్లడి
శ్రీలంకతో నిన్నటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఘోర పరాజయం పాలైంది. ఇప్పటివరకూ జరిగిన ఐదు మ్యాచుల్లో కేవలం ఒకటి మాత్రమే గెలిచిన ఇంగ్లండ్ సెమీస్‌లో కాలు పెట్టాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. భారత్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్‌తో జరిగే తదుపరి మ్యాచుల్లో నెగ్గినా కూడా ఇతర దేశాల ఫలితాలపైనే ఇంగ్లండ్ భవితవ్యం ఆధారపడి ఉంది. ప్రపంచకప్ ప్రారంభం కావడానికి ముందు అజేయంగా కనిపించిన ఇంగ్లండ్ ఇంతలా ఫాం లేమితో బాధపడుతుండటం ఆ టీం అభిమానులను వేధిస్తోంది. ఎందుకిలా? అనే ప్రశ్న మదిని తొలిచేస్తోంది.

మాజీ టీమిండియా క్రికెట్ వీరేంద్ర సెహ్వాగ్, ఈ ప్రశ్నకు చాలా సింపుల్‌గా సమాధానం చెప్పాడు. ‘‘50 ఓవర్ల వన్డే మ్యాచుల్లో ఇంగ్లండ్ గత కొంత కాలంగా ఓ సాధారణ జట్టులా మిగిలిపోతోంది. స్వదేశంలో జరిగిన 2019 వరల్డ్ కప్ మినహా గత 8 పర్యాయాల్లో ఏడు సార్లు వారు సెమీస్‌లో కాలుపెట్టలేదు. స్థిరత్వం లోపించడం, టీంలో తరచూ మార్పులు చేర్పులు చేయడం, టెస్టుల్లో ఉన్నంత సామర్థ్యం వన్డేల్లోనూ ఉందని భ్రమించడంతో వారు చాలా నష్టపోతున్నారు’’ అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.


More Telugu News