గ్రీన్ కార్డు దరఖాస్తు తొలి దశలోనే ఈఏడీ కార్డు.. వైట్ హౌస్ కమిటీ సిఫారసు

  • గ్రీన్ కార్డు దరఖాస్తు ప్రక్రియకు కీలక మార్పులు సిఫారసు చేసిన వైట్‌హౌస్ కమిటీ
  • దరఖాస్తు తొలి దశలోనే ఉద్యోగ అనుమతి కార్డు జారీ చేయాలని సూచన
  • ఈ సిఫారసుకు అధ్యక్షుడు బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే భారతీయులకు భారీ లబ్ధి
గ్రీన్ కార్డు దరఖాస్తు పరిశీలన తొలి దశలోనే లబ్ధిదారులకు ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డుతో ఉద్యోగ అనుమతి ఇవ్వాలని వైట్ హౌస్ కమిటి ఒకటి సిఫారసు చేసింది. దీంతో పాటూ గ్రీన్ కార్డు దరఖాస్తు ప్రక్రియకు పలు కీలక మార్పులు సూచించింది. వైట్‌హౌస్‌లోని ఏషియన్-అమెరికన్, నేటివ్ హవాయియన్, పసిఫిక్ ఐలాండర్ వ్యవహారాల కమిషనర్ ఈ ప్రతిపాదనకు ఆమెదం తెలిపారు. అమెరికా అధ్యక్షుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే అనేక మంది భారతీయులకు మేలు చేకూరుతుంది.

ప్రస్తుత ప్రక్రియ ప్రకారం, గ్రీన్ కార్డు కోసం అభ్యర్థులు తొలుత ఐ-140 దరఖాస్తు చేయాలి. ఆ తరువాత ఈ ప్రక్రియ కీలక దశకు చేరుతుంది. ఈ దశలో స్టేటస్ సర్దుబాటు జరుగుతుంది. దీన్ని ఐ485గా పిలుస్తారు. ఈ దశలోనే ఈఏడీ కార్డు, ఇతర ట్రావెల్ డాక్యుమెంట్ల అడ్వాన్స్ పెరోల్‌ను జారీ చేస్తారు. దీంతో, అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా పనిచేసుకునేందుకు అవకాశం దక్కుతుంది. తాజా సిఫార్సు అమల్లోకి వస్తే ప్రభుత్వం ఐ-140 దశలోనే ఈఏడీ జారీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రీన్ కార్డు కోసం దశాబ్దాల తరబడి వేచి చూడాల్సి వస్తున్నందున ఈ సిఫారసు భారతీయులకు మేలు కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.


More Telugu News