హైదరాబాద్‌కు అమిత్ షా... రేపు సూర్యాపేట బహిరంగ సభలో పాల్గొననున్న కేంద్రమంత్రి

హైదరాబాద్‌కు అమిత్ షా... రేపు సూర్యాపేట బహిరంగ సభలో పాల్గొననున్న కేంద్రమంత్రి
  • ఈ రోజు రాత్రి పదిన్నర గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి అమిత్ షా
  • నేషనల్ పోలీస్ అకాడమీలో ఈ రోజు రాత్రి బస
  • రేపు సాయంత్రం సూర్యాపేట బహిరంగ సభకు అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. రేపు సూర్యాపేట బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకోసం నేటి రాత్రి ఆయన హైదరాబాద్ రానున్నారు. రాత్రి గం.10.20కి శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. ఈ రాత్రి నేషనల్ పోలీస్ అకాడమీలో ఆయన బస చేస్తారు. రేపు (శుక్రవారం) ఉదయం 8 గంటల నుంచి గం.11 వరకు 75వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌‌లో పాల్గొంటారు.

మధ్యాహ్నం గం.3కు సూర్యాపేటకు బయలుదేరుతారు. సాయంత్రం గం.4 నుంచి గం.5 వరకు సూర్యాపేట బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం గం.5.45 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనం అవుతారు. మధ్యలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి.


More Telugu News