రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి సునీతా లక్ష్మారెడ్డి రాజీనామా

  • నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి, బీఫామ్ ఇచ్చిన కేసీఆర్
  • ఎన్నికల్లో పోటీ నేపథ్యంలో రాజ్యాంగపదవి నుంచి తప్పుకున్న సునీతా లక్ష్మారెడ్డి
  • రాజీనామాను ఆమోదించిన సీఎస్ శాంతికుమారి
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవికి సునీతా లక్ష్మారెడ్డి రాజీనామా చేశారు. నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆమెను సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించడంతో పాటు బీఫామ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె రాజ్యాంగపరమైన పదవి నుంచి తప్పుకున్నారు. ఆమె రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సునీతా లక్ష్మారెడ్డి రెండున్నరేళ్లకు పైగా ఆ పదవిలో ఉన్నారు.

మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవి చాలాకాలంగా ఖాళీగా ఉండటంతో హైకోర్టు ఆదేశాల మేరకు 2020 డిసెంబర్ 27న కమిషన్ ఏర్పాటైంది. ఆ తర్వాత సునీతా లక్ష్మారెడ్డి చైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ నేపథ్యంలో ఆమె ఆ పదవి నుంచి తప్పుకున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక కొత్త చైర్‌పర్సన్ నియమితులు కానున్నారు.


More Telugu News