లంక దెబ్బకు ఇంగ్లండ్ టాపార్డర్ ఢమాల్
- బెంగళూరులో వరల్డ్ కప్ మ్యాచ్
- శ్రీలంకపై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
- 17 ఓవర్లలో 85 పరుగులకే 5 వికెట్లు డౌన్
భారత్ లో జరుగుతున్న వరల్డ్ కప్ లో డిఫెండింగ్ చాంప్ ఇంగ్లండ్ కు ఏదీ కలిసిరావడంలేదు. ఇవాళ శ్రీలంకతో కీలక పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్... 17 ఓవర్లలో 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
బెయిర్ స్టో (30), డేవిడ్ మలాన్ (28) ఓ మోస్తరుగా రాణించినప్పటికీ... జో రూట్ (3), జోస్ బట్లర్ (8) తీవ్రంగా నిరాశ పరిచారు. జో రూట్ రనౌట్ కాగా, బట్లర్ తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ లహిరు కుమార బౌలింగ్ లో వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లహిరు కుమార రెండు వికెట్లతో సత్తా చాటాడు. ప్రమాదకర లియామ్ లివింగ్ స్టన్ (1) ను కూడా అవుట్ చేశాడు.
కసున్ రజిత, ఏంజెలా మాథ్యూస్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజులో బెన్ స్టోక్స్ (12 బ్యాటింగ్), మొయిన్ అలీ ఉన్నారు.