అమెరికాలో కాల్పుల ఘటన.. నిందితుడు గతంలో గృహహింస కేసులో అరెస్టు

  • ఆర్మీలో ఆఫీసర్ గా పనిచేసి రిటైరయ్యాడని పోలీసుల వివరణ
  • మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని వెల్లడి
  • కాల్పులు జరిపాక తెలుపు రంగు కారులో వెళ్లాడని ఫొటోలతో హెచ్చరికలు
అమెరికాలోని లెవిస్టన్ నగరంలో ఓ బార్ లో కాల్పులు జరిపి 22 మందిని చంపేసిన హంతకుడిని మాజీ సోల్జర్ గా అనుమానిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆఫీసర్ ర్యాంకులో పనిచేసి రిటైరైన రాబర్ట్ కార్డ్ ఈ దారుణానికి పాల్పడ్డట్లు చెప్పారు. గతంలో గృహ హింస (డొమెస్టిక్ వయొలెన్స్) కేసులో రాబర్ట్ అరెస్టయ్యాడని వివరించారు. లెవిస్టన్ లో కాల్పులు జరిపాక తెలుపు రంగు సుబారు కారులో పరారయ్యాడని చెబుతూ రాబర్ట్ కార్డ్ ఫొటోలను మీడియాకు రిలీజ్ చేశారు.

జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు లెవిస్టన్ ప్రజలను హెచ్చరించారు. తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. రాబర్ట్ కార్డ్ ను పట్టుకోవడానికి భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని, అప్పటి వరకు అధికారులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


More Telugu News