మ్యాక్స్‌వెల్ సెంచరీతో గవాస్కర్ యూటర్న్!
- నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు ముందు మ్యాక్స్‌వెల్‌పై గవాస్కర్ విమర్శలు
- నిర్లక్ష్యంగా ఉన్నాడంటూ తీవ్ర వ్యాఖ్య
- 40 బంతుల్లో సెంచరీతో గవాస్కర్‌ను ఆశ్చర్యపోయేలా చేసిన మ్యాక్స్‌వెల్
- గవాస్కర్ ఉండబట్టలేక ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్‌పై ప్రశంసల వర్షం
నెదర్లాండ్స్‌పై ఫాస్టెస్ట్ సెంచరీతో గ్లెన్ మ్యాక్స్‌వెల్ క్రికెట్ అభిమానులనే కాకుండా విశ్లేషకులు, కామెంటేటర్లను కూడా విస్తుపోయేలా చేశాడు. ఎంతగా అంటే.. మ్యాచ్‌కు ముందు అతడిని తీవ్రంగా విమర్శించిన సునీల్ గవాస్కర్ గంటల వ్యవధిలోనే తన స్టాండ్ మార్చుకోవాల్సి వచ్చింది.
నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ప్రారంభం కాకమునుపు మ్యాక్స్‌వెల్ షాట్ల ఎంపికపై గవాస్కర్ విమర్శలు గుప్పించాడు. ‘‘ఇది ఇగోకు సంబంధించిన విషయంలా ఉంది. ఆర్సీబీలో నెం.3 స్థానంలో దిగడం అతడికి సంతోషాన్నిచ్చింది. ప్రతి మ్యాచ్‌లో తాను ఏదో ఒకటి చేయాలనుకుంటాడు. ఇక్కడ మాత్రం నెం.5, 6, స్థానాల్లో దిగుతున్నాడు. ఈసారి కాస్త కేర్‌లెస్‌గా కనిపించాడు. పాకిస్థాన్‌లో మ్యాచ్‌లో తొలి బంతికే అవుటయ్యాడు. అసలు అదేమి షాటో నాకు అర్థం కాలేదు. అతడు నిర్లక్ష్యంగా ఉన్నాడని స్పష్టంగా చెప్పగలను’’ అంటూ మ్యాక్స్‌వెల్‌పై ఘాటు వ్యాఖ్యలే చేశాడు.
బరిలోకి దిగే సమయంలో మ్యాక్స్‌వెల్ ఈ వ్యాఖ్యలు వినే అవకాశం లేకపోయినప్పటికీ ఆ తరువాత మాత్రం తానేంటో నిరూపించుకున్నాడని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. కేవలం 40 బంతుల్లో సెంచరీ చేసిన మ్యాక్స్‌వెల్ ఏకంగా ప్రపంచ రికార్డునే నెలకొల్పాడు. ఆస్ట్రేలియా విజయంలో కీలకంగా మారాడు. అతడి అద్బుత ఇన్నింగ్స్ చూసి గవాస్కర్ గంటల వ్యవధిలోనే యూటర్న్ తీసుకున్నాడు.
‘‘ఇంతకు మించి గొప్ప షాట్స్ క్రికెట్‌లో ఉండవేమో. ఆ షాట్‌కు సిక్స్ కాదు.. పన్నెండు పరుగులు ఇవ్వాలి. నమ్మశక్యం కాని షాట్ ఇది. నెదర్లాండ్స్ వాళ్లకు ఎలా బౌల్ చేయాలో అర్థంకాని స్థితిలో పడిపోయారు. కాసేపు నెమ్మదిగా వేశారు. ఆ తరువాత మరో వ్యూహం పన్నారు. కానీ, మ్యాక్స్‌వెల్ దూకుడు అలాగే కొనసాగింది. జస్ట్ 40 బంతుల్లో సెంచరీ కొట్టేశాడు’’ అంటూ గవాస్కర్ తెగ పొగిడేశాడు.