బిషన్‌సింగ్ బేడీ మ్యాజిక్.. ఆసీస్ వికెట్లు టపటపా.. అత్యంత అరుదైన ఈ వీడియో చూశారా?
- ప్రపంచకప్ వేళ అరుదైన వీడియోను పంచుకున్న ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్
- 1977లో ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో బిషన్‌సింగ్ మాయాజాలం
- ఎలా ఆడినా గాల్లోకి లేచిన బంతి
- ఎదుర్కోలేక వికెట్లు పారేసుకున్న బ్యాటర్లు
సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఐపీఎస్ అధికారుల్లో సీవీ ఆనంద్ ముందువరసలో ఉంటారు. అద్భుతమైన వీడియోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. స్ఫూర్తినిచ్చే, అప్రమత్తం చేసే వీడియోలే కాదు, ఫన్నీ వీడియోలు, గత స్మృతులను గుర్తు చేసే అత్యంత అరుదైన వాటిని కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
ప్రస్తుతం ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో భారత జట్టు లెజెండ్ స్పిన్నర్ బిషన్‌సింగ్ బేడీకి సంబంధించి అరుదైన వీడియోను పంచుకున్నారు. బ్రిస్బేన్‌లో 1977 డిసెంబరు 2-6 మధ్య జరిగిన తొలి టెస్టుకు సంబంధించిన వీడియో ఇది. బిషన్‌సింగ్‌బేడీ తన మ్యాజిక్ బౌలింగుతో ఆసీస్ ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెట్టాడు.
ఐదు వికెట్లు తీసుకుని బెంబేలెత్తించాడు. ఎలా ఆడినా గాల్లోకి లేస్తున్న బంతిని ఎదుర్కోవడం చేతకాక బ్యాటర్లు వికెట్లు సమర్పించుకుని పెవిలియన్‌కు చేరారు. ఈ అరుదైన వీడియోను చూసి ఎంజాయ్ చేయాలంటూ ఆనంద్ షేర్ చేసిన ఈ వీడియోను చూసి క్రికెట్ ప్రేమికులు ముచ్చటపడుతున్నారు.