వరల్డ్ కప్ చరిత్రలోనే నెదర్లాండ్స్‌కు అత్యంత దారుణ పరాజయం

  • న్యూఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో నిన్న ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్
  • 309 పరుగుల భారీ తేడాతో ఓడిన నెదర్లాండ్స్
  • మ్యాక్స్‌వెల్, వార్నర్ చెలరేగడంతో నెదర్లాండ్స్ ఓటమి ఖరారు
  • 40 బంతుల్లోనే సెంచరీతో అత్యంత వేగవంతమైన శతకం రికార్డును నెలకొల్పిన మ్యాక్స్‌వెల్
నిన్నటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దెబ్బకు నెదర్లాండ్స్ వన్డే వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 309 పరుగుల భారీ తేడాతో నెదర్లాండ్స్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రతి బంతి నుంచి పరుగులు పిండుకుంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు నెదర్లాండ్స్‌కు మాత్రం మర్చిపోలేని దారుణ అనుభవాన్ని మిగిల్చారు. 

ఆస్ట్రేలియా విజయంలో ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కీలక పాత్ర పోషించాడు. కేవలం 40 బంతుల్లో సెంచరీతో వన్డే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేసుకున్నాడు. మ్యాక్స్‌వెల్‌కు డేవిడ్ వార్నర్ సెంచరీ కూడా తోడవడంతో ఆస్ట్రేలియా 399 పరుగుల భారీ లక్ష్యాన్ని నెదర్లాండ్స్‌ ముందుంచింది. 400 పరుగులు చేయడం అసాధ్యమన్న అంచనాలను నిజం చేస్తూ నెదర్లాండ్స్ చతికిల పడింది. స్కోరు వంద కూడా దాటకుండానే ఆవుటైంది. టీంలో కేవలం ఐదుగురు మాత్రమే రెండంకెల సంఖ్యలో పరుగులు చేయగలిగారంటే వారికి ఎంతటి క్లిష్ట పరిస్థితి ఎదురయ్యిందో అర్థం చేసుకోవచ్చు.


More Telugu News