సినీ నటుడు వెంకటేశ్ రెండో కుమార్తె నిశ్చితార్థం వేడుక

  • హైదరాబాద్‌లో నిశ్ఛితార్థం వేడుక
  • కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు, బంధువుల హాజరు
  • కాబోయే దంపతులను ఆశీర్వదించిన ప్రముఖ నటులు చిరంజీవి, మహేశ్ బాబు
ప్రముఖ తెలుగు సినీ నటుడు వెంకటేశ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన రెండో కుమార్తె హయవాహిని నిశ్చితార్థం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరయ్యారు. నటులు చిరంజీవి, మహేశ్ బాబు కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.  

ఇక వరుడి స్వస్థలం విజయవాడ అని, ఓ డాక్టర్ కుటుంబానికి చెందిన వ్యక్తి అని సమాచారం. వెంకటేశ్‌కు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. పెద్ద కుమార్తె ఆశ్రిత తన భర్తతో కలిసి విదేశాల్లో ఉంటున్నారు.


More Telugu News