బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు!: బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాం
- డబుల్ ఇంజిన్ సర్కార్‌తో తెలంగాణ అభివృద్ధి అన్న జాఫర్ ఇస్లాం
- బీఆర్ఎస్, మజ్లిస్... కాంగ్రెస్ బీటీమ్ అని విమర్శ
- కవిత కేసులో విచారణ జరుగుతోందన్న జాఫర్ ఇస్లాం
బీఆర్ఎస్‌కు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాం కొత్త అర్థం చెప్పారు. బీఆర్ఎస్ అంటే బ్రష్టాచార్ రిస్తేదార్ పార్టీ అని విమర్శలు గుప్పించారు. బుధవారం జాఫర్ మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం తమ పార్టీ సీరియస్‌గా పని చేస్తోందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కుటుంబం, అవినీతి గురించే బీఆర్ఎస్, మజ్లిస్, కాంగ్రెస్ పార్టీలు ఆలోచిస్తున్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి బీజేపీ అండగా నిలిచిందన్నారు. ఇక్కడ ప్రజల అభ్యున్నతి కోసం తెలంగాణకు మద్దతు ఇస్తున్నామన్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఒకే కుటుంబానికి లబ్ది చేకూరుతోందన్నారు. కాంగ్రెస్ అంటేనే అవినీతి పార్టీ అని ఆరోపించారు. మజ్లిస్, బీఆర్ఎస్ పార్టీలు ఆ పార్టీకి బీ-టీమ్‌గా పని చేస్తున్నాయన్నారు. యూపీఏకు బీఆర్ఎస్ ఎక్స్‌ట్రా ప్లేయర్‌గా పని చేస్తోందన్నారు.
ఈ పార్టీలన్నీ అవినీతి చేయడానికే పనిచేస్తాయని, కర్ణాటకలో భారీగా డబ్బు పట్టుకుంటున్నారని, ఆ డబ్బు కాంగ్రెస్ పార్టీ నేత వద్దే దొరికిందని అన్నారు. దొరికింది కొంత మాత్రమేనని.. వేల కోట్ల రూపాయల లింక్ దొరికిందని అన్నారు. కర్ణాటక నుంచి ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాలకు డబ్బు పంపుతున్నారని ఆరోపించారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారిందన్నారు. ఏజెన్సీని పెట్టుకుని డబ్బు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
కర్ణాటక నుంచి తమిళనాడుకు, అక్కడి నుంచి తమిళనాడు ప్రభుత్వం సహకారంతో తెలంగాణకు కాంగ్రెస్ స్లీపర్ సెల్ ద్వారా డబ్బులు చేరుతున్నాయన్నారు. బీజేపీ డబ్బుతో పనిచేయడం లేదని, కార్యకర్తలు కష్టపడి పనిచేసి అధికారంలోకి తీసుకు వస్తారని జాఫర్ ఇస్లాం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసిన వారి ఆశయాలను గుర్తు చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో ఓటేయాలన్నారు. మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అవినీతిపై విచారణ జరుగుతోందని, ఈ విచారణ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదన్నారు. అవినీతికి పాల్పడిన కవితను వదిలేది లేదన్నారు.