హౌస్ లో పెరిగిపోయిన 'బీప్'లు .. మందలించిన బిగ్ బాస్! 

  • 50వ రోజుకి చేరుకున్న 'బిగ్ బాస్'
  • నామినేషన్స్ లో జరిగిన రచ్చ 
  • నోరు జారుతున్న సభ్యులు 
  • సహనం అవసరమని చెప్పిన బిగ్ బాస్
'బిగ్ బాస్ హౌస్'లో రోజు రోజుకి 'బీప్' లు పెరిగిపోతున్నాయి. హౌస్ లోని అభ్యర్థులంతా కూడా చాలా సందర్భాల్లో సహనాన్ని కోల్పోతున్నారు. ఎవరికి అవకాశం వస్తే వారు, ఒక రేంజ్ లో ఆవేశపడిపోతున్నారు. ఆ సమయంలో తొందరపాటుతో మాటలు జారుతున్నారు. ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. నామినేషన్ విషయంలో ఒకరు చెబుతున్న రీజన్ ను మరొకరు ఎంతమాత్రం ఒప్పుకోవడం లేదు. 
 
నిన్న (50వ రోజు) జరిగిన నామినేషన్స్ లో అమర్ - భోలే మధ్య, గౌతమ్ - ప్రశాంత్, అమర్ - ప్రశాంత్, సందీప్ - యావర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. భోలే మాట తీరు .. ఎద్దేవా చేసే విధానం విషయంలో అమర్ సీరియస్ అయ్యాడు. 'హౌస్ లో నువ్వు ఉంటే ఎంత .. పోతే ఎంత .. ఇక్కడ నువ్వు నన్ను డాష్ చేసేదేమీ లేదు అంటూ నోరు జారాడు. ఇక ఆ తరువాత ప్రశాంత్ విషయంలోను ' ఈ నా .. డాష్'ను అంటూ మరోసారి అమర్ తొందరపడ్డాడు. 

ఇక సందీప్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని యావర్ అనడంతో, ఆయన తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశాడు. తనకి తెలుగు అర్థం కాదని సందీప్ అనడం పట్ల యావర్ మండిపడ్డాడు. ఈ వాదనలోనే సందీప్ వైపు నుంచి మరో 'బీప్' పడింది. ఆ మాటను సమర్ధించుకోవడానికి సందీప్ ప్రయత్నించాడు. అయితే ఇకపై హౌస్ లోని సభ్యులంతా అలాంటి మాటలను తగ్గించుకోవాలనీ, ఆలోచించుకుని మాట్లాడాలి అంటూ బిగ్ బాస్ మందలించాడు.


More Telugu News