కాంగ్రెస్ విజయం ఖాయం... సీఎం ఎవరన్నది పార్టీ నిర్ణయిస్తుంది: భట్టి
- నవంబరు 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
- కాంగ్రెస్ కు 74 నుంచి 78 స్థానాలు వస్తాయన్న భట్టి
- సీఎల్పీ భేటీ ఏర్పాటు చేసి సీఎంను ఎంపిక చేస్తామని వెల్లడి
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 74 నుంచి 78 స్థానాలు వస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎవరన్నది పార్టీ చూసుకుంటుందని తెలిపారు. సీఎల్పీ సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు.
ప్రజా సంపద దోపిడీకి పాల్పడిన కేసీఆర్ కుటుంబాన్ని వదిలించుకునేందుకు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రజల కలలు నిజం చేసేందుకు కాంగ్రెస్ పోరాడుతోందని భట్టి పేర్కొన్నారు.
ఓడిపోతామన్న విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే గుర్తించారని, వారు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తామని భట్టి వెల్లడించారు.