రామ మందిరం నిర్మాణం మన సహనానికి దక్కిన విజయం: ప్రధాని మోదీ
- ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో దసరా వేడుకలు
- హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
- చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా ప్రతీక అని వివరణ
- రామ మందిరం నిర్మాణం జరుపుకుంటుండడాన్ని చూడడం మన అదృష్టమని వెల్లడి
ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధాని ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయదశమి రోజున భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజ చేస్తారని వెల్లడించారు. విశ్వమానవ సంక్షేమం కాంక్షిస్తూ దసరా వేళ శక్తిపూజ చేస్తామని తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా పండుగ ప్రతీక అని వివరించారు.
ఇక, అయోధ్యలో సుదీర్ఘకాలం తర్వాత రామమందిరం నిర్మాణం జరుపుకుంటుండడాన్ని చూడడం మన అదృష్టమని పేర్కొన్నారు. రామ మందిరం నిర్మాణం మన సహనానికి దక్కిన విజయం అని అభివర్ణించారు.
ఆత్మరక్షణ కోసమే భారత్ ఆయుధాలు వాడుతుందని మోదీ స్పష్టం చేశారు. ఇతర దేశాలపై ఆధిపత్యం భారత్ విధానం కాదని ఉద్ఘాటించారు.