ప్రపంచకప్ గెలవాలని నన్ను ప్రేరేపించేది ఇదే: విరాట్ కోహ్లీ

  • ఛేజ్ బెటర్ మెంట్ అనేదే తన ప్రేరణ అని చెప్పిన కోహ్లీ
  • ప్రతి రోజు తనను తాను మెరుగు పరుచుకునే ప్రయత్నం చేస్తానని వెల్లడి
  • దీని వల్లే తాను ఇంత కాలం పాటు ఆడుతున్నానని వ్యాఖ్య
ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ లో టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఎక్కువ పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ల జాబితాలో 34 ఏళ్ల విరాట్ కూడా ఉన్నాడు. ఈ ప్రపంచకప్ ను గెలవడానికి తన నినాదం, తన ప్రేరణ ఏమిటో తాజాగా కోహ్లీ వెల్లడించాడు. 

'ఛేజ్ బెటర్ మెంట్' అనేదే తన మోటో అని చెప్పాడు. ప్రతి ఏడాది, ప్రతి సీజన్ లో, ప్రతి రోజు, ప్రతి ప్రాక్టీస్ సెషన్ లో తనను తాను మరింత మెరుగు పరుచుకోవడానికి యత్నిస్తానని తెలిపాడు. దీని వల్లే తాను ఇంత కాలం పాటు ఆడుతున్నానని, జట్టు కోసం తన వంతు ప్రదర్శన చేస్తున్నానని చెప్పారు. ఈ మైండ్ సెట్ లేకపోతే నిలకడగా రాణించడం కష్టమని అన్నాడు. నీ లక్ష్యం కేవలం ఒక గోల్ మాత్రమే అయితే... దాన్ని సాధించిన తర్వాత కష్టపడటాన్ని ఆపేస్తావని చెప్పాడు.


More Telugu News