టీడీపీ-జనసేన కలయికపై అంబటి రాంబాబు సెటైర్లు
- ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు
- రాజమండ్రిలో సోమవారం నాడు ఇరు పార్టీల సమన్వయ కమిటీ భేటీ
- హాజరైన పవన్ కల్యాణ్, నారా లోకేశ్
- ఇద్దరూ ఉత్తర కుమారులేనంటూ అంబటి వ్యంగ్యం
తెలుగుదేశం పార్టీ, జనసేనల మధ్య పొత్తులో నిన్న కీలక ముందడుగు పడింది. టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీ నిన్న రాజమండ్రిలో సమావేశం కావడం తెలిసిందే. ఈ సమావేశానికి నారా లోకేశ్, పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో, ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు విసిరారు. సూటుకేసు తీసుకో... లోకేషుతో కలిసిపో అంటూ పవన్, లోకేశ్ లు కలిసున్న ఫొటోను పంచుకున్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో... సొంత కుమారుడు, అద్దె కుమారుడు ఇద్దరూ ఉత్తర కుమారులే అంటూ ఎద్దేవా చేశారు.