వ్యభిచారంపై వ్యాఖ్యలతో వివాదంలో పడిన కమెడియన్

  • కూల్ ప్రొఫెషన్ గా పేర్కొన్న విదూషి స్వరూప్
  • ఆమె వ్యాఖ్యల పట్ల విమర్శల జడివాన
  • మహిళలను గౌరవించడం నేర్చుకోవాలంటూ సూచన
స్టాండప్ కమెడియన్ (లైవ్ షోలు నిర్వహించే) విదూషి స్వరూప్ తన వ్యాఖ్యలతో వివాదం కొనితెచ్చుకున్నారు. వ్యభిచారంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వ్యభిచారాన్ని ‘కూల్ ప్రొఫెషన్’ (ప్రశాంతమైన వృత్తి) గా పేర్కొన్నారు. ఇతర వృత్తుల కంటే ఇది ఎంత భిన్నమో ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు వెంటనే వేడిని రగిల్చాయి. ఇంటర్నెట్ లో ఆమెపై విమర్శల జడివాన కురవడం మొదలైంది.

ఏ మాత్రం స్పృహ లేకుండా చేసిన వ్యాఖ్యలుగా నెటిజన్లు విమర్శిస్తున్నారు. ‘‘మహిళలను ఎప్పుడూ గౌరవించండి. మహిళల గురించి ఇలా చెప్పడం సరికాదు. సిగ్గు పడాల్సిన చర్య’’ అని ఓ నెటిజన్ ఘాటుగా కామెంట్ చేశాడు. అదే సమయంలో విదూషి స్వరూప్ కు మద్దతు కూడా లభిస్తోంది. ‘‘హాస్యం ఉద్దేశ్యం సమాజాన్ని అద్దంలో చూపించడమే. మమ్మల్ని షాక్ కు గురిచేసేలా, నవ్వించేలా చేశారు’’ అని ఓ యూజర్ పేర్కొన్నారు. సమాజంలోని అంశాలను హాస్యంతో తెలియజెప్పడం అనేది కొందరే చేయగలరంటూ మరొక యూజర్ కామెంట్ చేశారు. 


More Telugu News