భార్యతో కలసి విరాట్ కోహ్లీ కొత్త వ్యాపారం
- నిసర్గ పేరుతో కొత్త వెంచర్ ప్రారంభం
- కార్యక్రమాలకు ప్రచార రూపం కల్పించడమే వ్యాపారం
- ఓ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం
ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ నాలుగు చేతులా సంపాదిస్తున్నాడు. ఒకవైపు క్రికెట్ నుంచి వచ్చే ఆదాయానికి తోడు, ప్రకటనల్లో కనిపించడం, బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం ద్వారా పెద్ద మొత్తంలో సమకూర్చుకుంటున్నాడు. పలు వ్యాపారాల్లోనూ అతడికి పెట్టుబడులు ఉన్నాయి. ఇప్పుడు భార్య అనుష్క శర్మతో కలసి కొత్త వ్యాపారానికి ప్లాన్ చేశాడు. కార్యక్రమాల (ఈవెంట్)కు ప్రచారం కల్పించే వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్టు విజయదశమి రోజున కోహ్లీ, అనుష్క ప్రకటించారు.
అధిక ప్రభావం చూపించగలిగే కార్యక్రమాలకు కోహ్లీ ప్రచారం తీసుకురానున్నాడు. ఈ వ్యాపారం కోసం ‘నిసర్గ’ పేరుతో కోహ్లీ దంపతులు వెంచర్ ప్రారంభించారు. ఎలైట్ ఆక్టేన్ అనే సంస్థతో నిసర్గ ఒప్పందం కూడా కుర్చుకుంది. మోటార్ స్పోర్ట్స్, ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాల నిర్వహణలో ఎలైట్ ఆక్టేన్ సేవలు అందిస్తోంది. ‘ద వ్యాలీ రన్’ తదితర మేథో సంపత్తి హక్కులు ఎలైట్ ఆక్టేన్ కు ఉన్నాయి. మోటార్ స్పోర్ట్స్, ఎంటర్ టైన్ మెంట్ విభాగంలో కొత్త ప్లాట్ ఫామ్ లను అమలు చేయడంలో ఎలైట్ ఆక్టేన్ కీలక పాత్ర పోషిస్తోంది.