నువ్వు కనిపిస్తే టీవీ పగలగొడతా: 'బిగ్ బాస్ హౌస్'లో శోభా శెట్టి ఫైర్!

  • బిగ్ బాస్ హౌస్ లో నిన్న జరిగిన నామినేషన్స్ 
  • హౌస్ లోని సభ్యుల మధ్య ఆవేశాలు .. వాదనలు
  • నామినేషన్స్ కి గల కారణాలను అంగీకరించని అభ్యర్థులు
  • పతాకస్థాయికి చేరుకున్న శోభ - భోలా మాటల యుద్ధం
బిగ్ బాస్ హౌస్ లో నిన్న 50వ రోజున నామినేషన్స్ ప్రక్రియ నడిచింది. తనని నామినేట్ చేసిన గౌతమ్ ను భోలే ఆటపట్టిస్తూ మాట్లాడాడు. తన ఆటతీరు వీక్ గా ఉందనడానికి ముందు, ఆయన ఆట తీరును ఒకసారి పరిశీలన చేసుకోవాలని అన్నాడు. ఇక ప్రియాంక నామినేట్ చేసేటప్పుడు కూడా భోలే ఇదే విధంగా ప్రవర్తించాడు. ఆమె చెబుతున్న రీజన్ సరిగ్గా లేదంటూ 'ఇక చాల్లే పోవమ్మా' అనేశాడు. 

శోభా శెట్టిని భోలే నామినేట్ చేసినప్పుడు కూడా పెద్ద వాదనే జరిగింది. శోభ తన మాటతీరును మార్చుకోవాలని భోలే అన్నాడు. గతంలో జరిగిన సంఘటన విషయంలో తాను సారీ చెప్పినా ఆమె తీసుకోకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడు. బయటికి వెళ్లిన తరువాత ఈ ఎపిసోడ్ చూసి ఆమె బాధపడటం ఖాయమని అన్నాడు. 

అందుకు శోభ స్పందిస్తూ .. తన పద్ధతి మారదనీ . తన ఆటతీరు .. మాట తీరు ఇలాగే ఉంటుందని తేల్చి చెప్పింది. బయటికి వెళ్లిన తరువాత అసలు అతని గురించిన ఆలోచనే చేయనని అంది. అతనున్న ఎపిసోడ్స్ తాను చూడననీ, అతను కనిపిస్తే టీవీ పగలగొడతానని చెప్పింది. ఆమెలో మార్పు రావాలని కోరుకుంటున్నట్టుగా చెబుతూ, భోలా నామినేట్ చేశాడు. 


More Telugu News