బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పీ, కమ్యూనిస్టులు ఎవరైనా...: విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు

బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పీ, కమ్యూనిస్టులు ఎవరైనా...: విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు
  • దసరా శుభాకాంక్షలు తెలిపిన రాములమ్మ
  • ఆ తర్వాత ఎన్నికలను ప్రస్తావించిన విజయశాంతి
  • ఏ పార్టీ వారైనా ఎన్నికలు ప్రశాంతంగా ఉండేలా వ్యవహరించాలని విజ్ఞప్తి
బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి ఆసక్తికర ట్వీట్ చేశారు. దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెప్పడంతో పాటు అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రజలందరూ సంతోషాలతో ఉండేలా అమ్మ వారు దీవించాలని ఆమె కోరుకున్నారు. అనంతరం ఎన్నికలకు సంబంధించి ప్రస్తావించారు.

అసెంబ్లీ ఎన్నికల వాతావరణం నడుస్తున్న ఈ పరిస్థితిల్లో, తెలంగాణ బిడ్డలు... బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పీ, కమ్యూనిస్టులు ఇంకా ఏ ఇతర పార్టీల వారైనా... ఘర్షణలు, కొట్లాటలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించబడే విధంగా వ్వవహరించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రతి తెలంగాణ ఇల్లు ఈ ఎన్నికల తర్వాత కూడా మరెన్నో శుభాలతో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. హర హర మహాదేవ్... జై తెలంగాణ అంటూ ముగించారు.


More Telugu News