సున్నాలు కలిస్తే... పవన్ కల్యాణ్, నారా లోకేశ్ భేటీపై అంబటి రాంబాబు
- సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించిన మంత్రి అంబటి రాంబాబు
- రాజమండ్రిలో పాత కలయికకు కొత్త రూపం అని కామెంట్
- 0+0 =0 ! అంటూ లోకేశ్, పవన్‌ను ఉద్దేశించి ఎద్దేవా
రాజమహేంద్రవరంలో టీడీపీ - జనసేన సమన్వయ కమిటీ భేటీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి చురకలు అంటించారు. రాజమండ్రిలో పాత కలయికకు కొత్త రూపం అంటూ కామెంట్ చేశారు. తద్వారా గతంలోని మిత్రులే ఇప్పుడు మరోసారి కలిశారని అభిప్రాయపడ్డారు. అలాగే వీరిద్దరూ కలిసినా ఏమీ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 0 ప్లస్ 0 =0 ! అంటూ వారిద్దరిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
కాగా, టీడీపీ - జనసేన సమన్వయ కమిటీ భేటీలో పవన్ కల్యాణ్, లోకేశ్ పాల్గొన్నారు. నవంబర్ 1న ఇరుపార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణను ప్రకటించాలని నిర్ణయించాయి. ఈ సమావేశంలో మూడు తీర్మానాలు చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఒకటి, వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలను రక్షించాలని రెండో తీర్మానం, రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పోరాటం చేయాలని మూడో తీర్మానం చేశారు.