కన్నడ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. అసలు కారణం ఏంటంటే..!
- కన్నడ బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంతోష్ అరెస్ట్
- పులిగోరు ధరించడంతో అదుపులోకి తీసుకున్న అటవీశాఖ
- బిగ్ బాస్ చరిత్రలో ఇదే తొలిసారి
రియాల్టీషో ‘బిగ్‌బాస్’ చరిత్రలో తొలిసారి ఒక కంటెస్టెంట్ హౌస్‌లో ఉండగానే అరెస్టయ్యారు. పులిగోరు లాకెట్ ధరించి కన్నడ బిగ్‌బాస్ షో-10వ సీజన్‌లో పాల్గొన్న కారణంగా వర్తుర్ సంతోష్ అనే కంటెస్టెంట్‌ను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. పులిగోరు ధరించడం చట్టవిరుద్ధమని, అందుకే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని వెల్లడించారు. సంతోష్ పులిగోరు ధరించినట్టు తమకు ఫిర్యాదులు అందాయని అధికారులు వెల్లడించారు.
బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి మరీ సంతోష్‌ను అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. తొలుత సంతోష్‌ని అప్పగించడానికి నిర్వాహకులు నిరాకరించారు. అయితే తమ విధులకు అడ్డుతగలొద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరించడంతో వారు అనుమతిచ్చారు. సంతోష్ ధరించిన పులిగోరును స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.
వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించడంతోనే ఆయనను అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రస్తుతం ఆయన రామోహళ్లి ఫారెస్ట్ అధికారుల అదుపులో ఉన్నారని, విచారణ అనంతరం సంతోష్‌ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. హోసూర్‌లో పులిగోరును కొనుగోలు చేసినట్టు అటవీశాఖ అధికారులకు సంతోష్ చెప్పారని తెలుస్తోంది.