ఆఖరి 5 ఓవర్లలో పరిస్థితి తారుమారు చేసిన ఇఫ్తికార్... పాక్ భారీ స్కోరు
- వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
- నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు
- 27 బంతుల్లో 40 పరుగులు చేసిన ఇఫ్తికార్
- ఆఖరి 5 ఓవర్లలో 61 పరుగులు రాబట్టిన పాక్
వరల్డ్ కప్ లో నేడు పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసింది.
ఓ దశలో పాక్ ను ఆఫ్ఘన్ బౌలర్లు సమర్థవంతంగా కట్టడి చేశారు. ఆఫ్ఘన్ చైనామన్ స్పిన్నర్ నూర్ అహ్మద్ ధాటికి పాక్ విలవిల్లాడింది. నూర్ అహ్మద్ 3 కీలక వికెట్లు తీసి పాక్ ను దెబ్బకొట్టాడు. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (58), కెప్టెన్ బాబర్ అజామ్ (74), మహ్మద్ రిజ్వాన్ (8)లను నూర్ అహ్మద్ అద్భుతమైన బంతులతో బోల్తా కొట్టించాడు. ఆఫ్ఘన్ బౌలర్ల విజృంభణ చూస్తే పాక్ భారీ స్కోరు సాధించడం కష్టమే అనిపించింది.
44 ఓవర్లలో పాక్ స్కోరు 5 వికెట్లకు 215 పరుగులు. కానీ, ఆ తర్వాత ఇఫ్తికార్ అహ్మద్ చెలరేగడంతో పరిస్థితి మారిపోయింది. ఆఖరి 5 ఓవర్లలో పాక్ జట్టు 61 పరుగులు జోడించింది. ఇఫ్తికార్ 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 40 పరుగులు చేశాడు. భారీ షాట్లతో హడలెత్తించాడు. మరో ఎండ్ లో షాదాబ్ 38 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 40 పరుగులు చేశాడు.
ఆఫ్ఘన్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3, నవీనుల్ హక్ 2, మహ్మద్ నబీ 1, అజ్మతుల్లా ఒమర్జాయ్ 1 వికెట్ తీశారు.