జర్మన్ యూనిటీ డే సెలబ్రేషన్స్... క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్!

  • భారత్‌లో జర్మన్ యూనిటీ డే సెలబ్రేషన్స్
  • హాజరైన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి
  • ఇటలీలో ఉన్నందున హాజరు కాలేదని వీడియో కాల్ ద్వారా క్షమాపణ చెప్పిన చెర్రీ
భారత్‌లో జరిగిన జర్మన్ యూనిటీ డే సెలబ్రేషన్స్‌కు ఆర్ఆర్ఆర్ చిత్రబృందం తరఫున సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి హాజరయ్యారు. ఈ వేడుకలకు జర్మనీ ఎంబసీకి చెందిన సిబ్బంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి నటుడు రామ్ చరణ్ హాజరు కాలేదు. కానీ వీడియో కాల్ ద్వారా అందరినీ పలకరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... వేడుకలకు హాజరుకాలేకపోయినందుకు అందరికీ క్షమాపణలు చెప్పారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం తాను ఇటలీలో ఉన్నానని, అందుకే హాజరు కాలేదన్నారు. అవకాశం వచ్చినప్పుడు అందర్నీ కలుస్తానని చెప్పారు. ఈవెంట్‌లో నాటునాటు పాటకు సంబంధించిన కటౌట్ చూసి తనకు ఎంతో ఆనందం వేసిందన్నారు.

జర్నన్ యూనిటీ డే సందర్భంగా కీరవాణి జర్మన్ భాషలో పాటపాడి అందర్నీ అలరించారు. జర్మన్ దౌత్య సిబ్బంది నాటునాటు పాటకు కాలు కదిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను జర్మన్ ఇండియా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.


More Telugu News