కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

  • 825 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 260 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 3 శాతం వరకు పడిపోయిన జేఎస్ డబ్ల్యూ స్టీల్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో పాటు క్రూడాయిల్ ధరలు పెరగడం వంటివి మదుపరుల సెంటిమెట్ ను దెబ్బతీశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 825 పాయింట్లు కోల్పోయి 64,571కి పడిపోయింది. నిఫ్టీ 260 పాయింట్లు కోల్పోయి 19,281కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (0.36%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.35%). 

టాప్ లూజర్స్:
జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-2.99%), టాటా స్టీల్ (-2.52%), టీసీఎస్ (-2.44%), టాటా మోటార్స్ (-2.32%), విప్రో (2.27%).


More Telugu News