తుది జట్టులో అవకాశం రాకపోవడంపై మొహమ్మద్ షమీ స్పందన

  • తుది జట్టులో స్థానం లభించకపోతే గిల్టీగా ఫీల్ కాకూడదన్న షమీ
  • స్థానం లేకపోయినా మనం ప్రపంచకప్ లో భాగమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని వ్యాఖ్య
  • ఇతరుల సక్సెస్ ను కూడా అందరం గౌరవించాలన్న షమీ
ప్రపంచకప్ లో భాగంగా న్యూజిలాండ్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 54 పరుగులకు 5 వికెట్లు పడగొట్టిన మొహమ్మద్ షమీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా వన్డే ప్రపంచ కప్ లలో ఐదు వికెట్లను రెండు సార్లు పడగొట్టిన తొలి ఇండియన్ బౌలర్ గా ఘనత సాధించాడు. 

మ్యాచ్ తర్వాత షమీ మట్లాడుతూ, ఏ ఆటగాడికైనా తుది జట్టు 11 మందిలో చోటు దక్కకపోతే గిల్టీగా ఫీల్ కాకూడదని చెప్పాడు. తనకు తుది జట్టులో స్థానం దక్కనప్పుడు బెంచ్ మీద నుంచి అంతా పరిశీలిస్తానని తెలిపాడు. మనకు స్థానం దక్కకపోయినా... మనం ప్రపంచకప్ లో భాగమని చెప్పాడు. ఇతరుల సక్సెస్ ను కూడా అందరం గౌరవించాలని తెలిపాడు. తుది జట్టులో మనకు ఈరోజు చోటు దక్కకున్నా... రేపు దక్కుతుందని చెప్పాడు. 

ఈ మ్యాచ్ లో తాను తీసిన 5 వికెట్లు విలువైనవేనని తెలిపాడు. మనం తీసే ప్రతి వికెట్ విలువైనదేనని చెప్పాడు. ప్రతి వికెట్ ను తాను ఎంజాయ్ చేశానని తెలిపాడు.


More Telugu News