తమిళనాట 'లియో' సంచలనం .. 4 రోజుల్లోనే 100 కోట్లు!
- ఈ నెల 19న విడుదలైన 'లియో'
- తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో 32 కోట్ల గ్రాస్
- దగ్గరలో లేని భారీ సినిమాలు
- 'లియో' వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్
విజయ్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందిన 'లియో' ఈ నెల 19వ తేదీన థియేటర్లకు వచ్చింది. భారీ బడ్జెట్ తో లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో 32 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఒక్క తమిళనాడులోనే 4 రోజుల్లో ఈ సినిమా 100 కోట్లకిపైకి వసూళ్లను రాబట్టడం విశేషం.
'మాస్టర్' సినిమా నుంచి విజయ్ కి ఇక్కడ మార్కెట్ పెరిగింది. 'వారసుడు' సినిమా ఇక్కడ ఆయనకి మరింత హెల్ప్ అయింది. ఇక 'మాస్టర్' .. 'విక్రమ్' సినిమాలతో బాగా పాప్యులర్ అయిన లోకేశ్ కనగరాజ్ కి కూడా ఇక్కడ మంచి ఇమేజ్ ఉంది. ఆయన సినిమాలపై అంచనాలు ఉన్నాయి.
అందువలన సహజంగానే థియేటర్ల దగ్గర సందడి కనిపిస్తోంది. దసరా సెలవులు కూడా ఈ సినిమా వసూళ్లు పెరగడానికి కారణమయ్యాయని చెప్పచ్చు. భారీతనం .. యాక్షన్ ఎపిసోడ్స్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయని అంటున్నారు. దగ్గరలో భారీ సినిమాలేం లేకపోవడం ఈ సినిమాకి కలిసొచ్చే మరో అంశం.