న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో అద్భుత రికార్డు!
- ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వన్డే సిక్సులు కొట్టిన భారత ఆటగాడిగా రికార్డు
- నిన్నటి మ్యాచ్‌లోని సిక్స్‌తో కలిపి ఇప్పటివరకూ 53 సిక్సులు బాదిన రోహిత్
- తొలి రెండు స్థానాల్లో ఏబీ డివిలియర్స్(58 సిక్సులు), క్రిస్ గెయిల్(56)
ఈ వరల్డ్‌కప్‌లో మంచి ఫాంలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మరో రికార్డు నెలకొల్పాడు. ఒక క్యాలెండర్ సంవత్సరంలో జరిగిన వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు సాధించాడు. క్రిస్ గేల్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేసే దిశగా మరో అడుగు వేశాడు.
ఆదివారం నాటి మ్యాచ్‌లో మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో రోహిత్ శర్మ సిక్స్ కొట్టి మొత్తం 53 సిక్సులతో మూడో స్థానానికి చేరుకున్నాడు. 2015లో జరిగిన వన్డేల్లో 58 సిక్సులతో ఏబీ డివిలియర్స్ మొదటి స్థానంలో నిలవగా 2019లో క్రిస్ గెయిల్ 56 సిక్సులు బాది రెండో స్థానంలో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో రోహిత్ శర్మ 46 పరుగుల వద్ద లాకీ ఫెర్గ్యూసన్‌కు వికెట్ ఇచ్చుకుని పెవిలియన్ బాటపట్టిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ బ్యాటర్లకు తొలుత షమీ బ్రేకులు వేయగా ఛేదనలో విరాట్ విజృంభించి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.