వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన శుభ్ మాన్ గిల్

  • సూపర్ ఫామ్ లో ఉన్న శుభ్ మాన్ గిల్
  • 12 ఏళ్ల నాటి వరల్డ్ రికార్డు గిల్ కైవసం
  • వన్డేల్లో అత్యంత వేగంగా 2,000 పరుగులు సాధించిన గిల్ 
  • 38 ఇన్నింగ్స్ లలో ఈ ఫీట్ సాధించిన ఓపెనర్
  • తెరమరుగైన హషీమ్ ఆమ్లా రికార్డు
టీమిండియా డైనమిక్ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ సరికొత్త వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. ఇవాళ వరల్డ్ కప్ లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ సందర్భంగా గిల్ 12 ఏళ్ల నాటి వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్ మన్ గా గిల్ రికార్డు పుటల్లో కెక్కాడు. గిల్ కేవలం 38 ఇన్నింగ్స్ లలోనే 2 వేల పరుగులు సాధించాడు. 

గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం హషీమ్ ఆమ్లా పేరిట ఉంది. ఆమ్లా 40 ఇన్నింగ్స్ లలో 2,000 పరుగులు చేశాడు. ఇప్పుడా రికార్డు గిల్ కైవసం చేసుకున్నాడు. ఇటీవలే గిల్... అత్యంత వేగంగా 2,000 పరుగులు పూర్తి చేసుకున్న భారత క్రికెటర్ గా శిఖర్ ధావన్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.


More Telugu News