ఈ దసరాకు జగనాసుర దహనం చేద్దాం: నారా లోకేశ్

  • ‘సైకో పోవాలి’ అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయాలని పిలుపు
  • విజయ దశమి సందర్భంగా సోమవారం రాత్రి 7 గంటలకు నిరసన కార్యక్రమం
  • చెడుపై చంద్రబాబు సాధించబోయే విజయంగా ఈ దసరా సెలబ్రేట్ చేసుకోవాలన్న లోకేశ్
విజయ దశమి పండుగను సైకో జగన్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించబోయే విజయంగా నిర్వహించుకోవాలని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. పండుగపూట వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. దసరాకు దేశం మొత్తం రావణాసుర దహనం చేస్తుందని చెబుతూ మనం మాత్రం జగనాసుర దహనం చేద్దామని ఏపీ ప్రజలకు సూచించారు. అక్టోబర్ 23న విజయ దశమి పర్వదినం సందర్భంగా రాత్రి 7 గంటలకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి రావాలని కోరారు. ‘సైకో పోవాలి’ అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లోకేశ్ విజ్ఞప్తి చేశారు. 

దేశం చేస్తోంది రావ‌ణాసుర ద‌హ‌నం-మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం. అరాచ‌క, విధ్వంస‌క పాల‌న సాగిస్తున్న సైకో జ‌గ‌నాసురుడి పీడ పోవాల‌ని నిన‌దిద్దాం. అక్టోబ‌ర్ 23 విజ‌య‌ద‌శ‌మి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా రాత్రి 7 గంట‌ల నుంచి 7.05 నిమిషాల మ‌ధ్య‌లో వీధుల్లోకి వ‌చ్చి ``సైకో పోవాలి`` అని రాసి ఉన్న ప‌త్రాల‌ను ద‌హ‌నం చేయండి. ఆ వీడియో, ఫోటోల‌ను సోషల్ మీడియాలో షేర్ చేయాలని నారా లోకేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.



More Telugu News