పవన్ కల్యాణ్ కు రాజకీయాలు తెలియవన్న అంబటి రాంబాబు
- చంద్రబాబుకు అమ్ముడుపోయి రాజకీయం చేస్తున్నాడని విమర్శ
- టీడీపీ, జనసేన కలిసి వచ్చినా వైసీపీని ఓడించలేరని ధీమా
- జగన్ ను ఓడించడం ఎవరి వల్లా కాదన్న అంబటి రాంబాబు
పవన్ కల్యాణ్ కు రాజకీయాలు తెలియవని ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అభిమానులకు, మా కులపు వాళ్లకు ఒకటే చెబుతున్నా.. పవన్ కు రాజకీయాలు తెలియవని, ఆయన చంద్రబాబుకు అమ్ముడుపోయాడని అంబటి ఆరోపించారు. మా లీడర్ ముఖ్యమంత్రి కావాలి, మా కులపోడు ముఖ్యమంత్రి కావాలని మీరు ఆశపడుతున్నారు.. అయితే మంచిదే, కానీ కాడని చెప్పారు. తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని స్వయంగా పవన్ కల్యాణ్ చెప్పినా వినిపించుకోకపోతే ఎలాగని ప్రశ్నించారు. చంద్రబాబుకు అమ్ముడుపోయి టీడీపీ కోసం పవన్ కల్యాణ్ రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు.
ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ జగన్ ను ఓడించడం ఎవరి వల్లా కాదని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన కలిసి వచ్చినా, మరో ఇద్దరితో కలిసి వచ్చినా వైసీపీపై ఎలాంటి ప్రభావం ఉండదని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ నేత కూడా సాహసించని సవాల్ ను జగన్ ప్రతిపక్షాలకు విసురుతున్నారని చెప్పారు. ‘ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో మీ ఇంట్లో వారికి లబ్ది కలిగితేనే మాకు ఓటేయండి, లేదంటే వేయొద్దు’ అంటూ ఓటర్లకు సూచించిన ఒకే ఒక లీడర్ జగన్ అని మంత్రి అంబటి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో మరోమారు వైసీపీ అధికారంలోకి వస్తుందని మంత్రి జోస్యం చెప్పారు.