ఆస్ట్రేలియా-పాక్ మ్యాచ్‌లో ఫ్యాన్స్ దబిడిదిబిడి.. వీడియో ఇదిగో!
- సీటు కోసం ఇద్దరు ప్రేక్షకుల మధ్య వివాదం
- తొలుత వాగ్వాదం, ఆపై ఒకరినొకరు తోసుకున్న వైనం
- చుట్టుపక్కల వారు కల్పించుకోవడంతో సద్దుమణిగిన వివాదం
క్రికెట్ ప్రపంచాన్ని ప్రస్తుతం వరల్డ్ కప్ ఫీవర్ కమ్మేసింది. అభిమానులకు క్రికెట్ అంటే ఓ భావోద్వేగం కాబట్టి ఎమోషన్స్ పీక్స్‌లోనే ఉంటాయి. దీంతో, వారు చిన్న విషయాలకే అదుపుకోల్పోయి కోపతాపాలను ప్రదర్శిస్తుంటారు. ఫలితంగా, పలు స్టేడియాలలో ఈ మారు ఫ్యాన్స్ మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. బెంగళురులో ఇటీవల ఆస్ట్రేలియా-పాక్ మ్యాచ్ సందర్భంగా ఇలాంటి దృశ్యం వెలుగులోకి వచ్చింది. ఓ సీటు గురించి ఇద్దరు ప్రేక్షకుల మధ్య గొడవ తాలూకు వీడియో వైరల్‌గా మారింది.
తొలుత ఆ ఇద్దరు ప్రేక్షకులు మాటామాట అనుకుని ఆ తరువాత ఒకరినొకరు తోసుకుని కింద పడ్డారు. వివాదం మరింత ముదిరేలోపే అక్కడున్న వారు ఇద్దరినీ వారించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
కాగా, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పాక్‌పై 62 రన్స్ తేడాతో గొప్ప విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు మార్ష్, వార్నర్ అద్భుత శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు ఇద్దరూ కలిసి ఏకంగా 259 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆస్ట్రేలియా విజయానికి గట్టిపునాది పడింది. కీలక క్యాచ్‌లను జార విడిచిన పాక్ ప్లేయర్లు చివరకు భారీ మూల్యమే చెల్లించారు. పాక్ కూడా తొలుత పోరాట పటిమను ప్రదర్శించింది. ఒకానొక దశలో పాక్‌కు విజయావకాశాలు కనిపించినప్పటికీ ఆస్ట్రేలియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్స్ తీయడంతో 367 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేక పాక్ ఒత్తిడికి చిత్తై చివరకు చతికిలపడింది.