భారత్‌లో కాలుపెట్టిన 70 మంది ఉగ్రవాదులు!

  • నకిలీ పాస్‌పోర్టులతో ఉగ్రవాదులు నేపాల్ మీదుగా వచ్చినట్టు నిఘా వర్గాల అనుమానం
  • ఉగ్రవాదులు ఐఎస్ఐ, జమాత్ ఉల్ ముజాహిదీన్, బంగ్లాదేశ్‌ వారిగా గుర్తించిన వైనం
  • బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రతా దళాలను అప్రమత్తం చేసిన కేంద్రం
  • ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ప్రారంభం
భారత్‌లోకి సుమారు 70 మంది ఉగ్రవాదులు అక్రమంగా ప్రవేశించినట్టు కేంద్ర నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. నకిలీ పాస్‌పోర్టులతో వీరంతా నేపాల్ సరిహద్దు మీదుగా భారత్‌లోకి వచ్చినట్టు భావిస్తున్నాయి. ఈ ఉగ్రవాదులు ఐఎస్ఐ, జమాత్ ఉల్ ముజాహిదీన్, బంగ్లాదేశ్‌కు చెందిన వారిగా గుర్తించాయి. కేంద్రం వెంటనే బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద ఉన్న బలగాలను అప్రమత్తం చేసింది. భారత్‌లోకి వచ్చిన ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.


More Telugu News