దక్షిణాఫ్రికా చేతిలో ఘోరపరాభవం నుంచి తేరుకోక ముందే ఇంగ్లండ్‌కు షాక్.. వరల్డ్ కప్ నుంచి టాప్లీ ఔట్
- దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో టాప్లీ వేలుకు బలమైన గాయం
- విరిగి ఉండొచ్చని వైద్యుల అనుమానం
- నిర్ధారణ కోసం వేచిచూస్తున్న ఇంగ్లండ్ టీమ్
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ప్రస్తుత వరల్డ్ కప్‌లో డీలా పడుతోంది. అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతోంది. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడగా కేవలం ఒకదాంట్లో మాత్రమే గెలిచింది. ఇక శనివారం రాత్రి దక్షిణాఫ్రికా చేతిలో ఇంగ్లండ్ ఘోరపరాభవాన్ని మూటగట్టుకుంది. ఏకంగా 229 పరుగుల తేడాతో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానానికి దిగజారింది. ఈ షాక్ నుంచి తేరుకోక ముందే ఇంగ్లండ్ టీమ్ మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.
దక్షిణాఫ్రికాపై మ్యాచ్‌లో గాయపడ్డ ప్రధాన పేసర్, ఇంగ్లండ్ తరపున ప్రస్తుత టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రీస్ టాప్లీ ఈ వరల్డ్ కప్ నుంచి పూర్తిగా నిష్ర్కమించడం ఖాయమైంది. మ్యాచ్‌లో అతడి చేతి వేలుని బంతి బలంగా తాకడంతో తీవ్రమైన గాయమైంది. బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతిని అందుకునే క్రమంలో ఈ గాయమైంది. వేలు విరిగి ఉండొచ్చని జట్టు వైద్యులు అనుమానిస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అతడు ఈ టోర్నీకి దాదాపు దూరమైనట్టే కనిపిస్తోంది. టాప్లీ ఇక మళ్లీ పాల్గొనే అవకాశం లేదని ఇంగ్లండ్ కోచ్ మాథ్యూ మోట్ అభిప్రాయపడ్డారు.
టాప్లీ వేలు గాయం తీవ్రతను నిర్ధారించడానికి తాము ఇంకా వేచి చూస్తున్నామని, వేలు విరిగినట్టుగా అనిపిస్తోంది, నిర్ధారణ కావాల్సివుందని మోట్ అన్నారు. వేలు చిట్లి ఉంటే అతనికి ఆడటం కష్టతరం అవుతుందని వ్యాఖ్యానించారు. అయితే టాప్లీ దూరమైతే అతడి స్థానంలో ఇప్పటికే టోర్నీ నిష్ర్కమించిన జోఫ్రా ఆర్చర్‌ను జట్టులోకి తీసుకొస్తారా? ఇంకెవరినైనా తీసుకొస్తారా అనేది వేచిచూడాల్సి ఉంది.