పీవీ సింధు, కరోలినా మారిన్ మధ్య మాటల యుద్ధం... వీడియో ఇదిగో!
- డెన్మార్క్ ఓపెన్ లో సింధు × మారిన్
- ఓటమిపాలైన సింధు
- మ్యాచ్ సందర్భంగా సహనం కోల్పోయిన ఇరువురు క్రీడాకారిణులు
- ఇద్దరికీ ఎల్లో కార్డు చూపించిన అంపైర్
భారత బ్యాడ్మింటన్ తార పీవీ సింధు, స్పెయిన్ అగ్రశ్రేణి షట్లర్ కరోలినా మారిన్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. డెన్మార్క్ ఓపెన్ లో వీరిద్దరి మధ్య జరిగిన పోరులో ఒకరినొకరు దూషించుకోవడం పలుమార్లు కనిపించింది. ఈ మ్యాచ్ లో కరోనాలినానే విజయం సాధించింది. మూడు గేముల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో సింధు 18-21, 21-19, 7-21తో ఓటమిపాలైంది.
అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఇరువురు ఒకరిపై ఒకరు వాగ్బాణాలు సంధించుకున్నారు. పాయింట్ సాధించిన ప్రతిసారి ఏదో ఒకటి అంటూ పరస్పరం ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. దాంతో సింధు, మారిన్ లను అంపైర్ అనేక పర్యాయాలు హెచ్చరించారు. చివరి గేమ్ లో మరీ శ్రుతి మించడంతో అంపైర్ ఇరువురికి ఎల్లో కార్డులు చూపించారు. సింధు త్వరగా సర్వీస్ చేయకపోవడం కూడా అంపైర్ ను అసంతృప్తికి గురిచేసింది.
మ్యాచ్ విషయానికొస్తే తొలి గేమ్ లో ఓడిన సింధు, హోరాహోరీగా సాగిన రెండో గేమ్ లో విజయం సాధించింది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్ లో సింధు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. ఏకపక్షంగా సాగిన ఆ గేమ్ లో మారిన్ విజృంభించి, గేమ్ తో పాటు మ్యాచ్ ను కూడా కైవసం చేసుకుంది.