దసరా సందర్భంగా అధిక ధరలు వసూలు చేస్తే బస్సులు సీజ్: ఏపీ రవాణాశాఖ హెచ్చరిక

  • విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు బస్సులు నడిపే ఆపరేటర్లకు హెచ్చరిక
  • అధిక ధరలు వసూలు చేస్తే రవాణాశాఖ దాడులు నిర్వహిస్తుందని వెల్లడి
  • తనిఖీల కోసం 19 బృందాలను నియమించామన్న రవాణాశాఖ
విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు బస్సులు నడిపే ఆపరేటర్లు అధిక ధరలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తామని విజయవాడ డిప్యూటీ ట్రాన్సుపోర్ట్ కమిషనర్ పురేంద్ర హెచ్చరించారు. అధిక ధరలు వసూలు చేసే ఆపరేటర్లు, బస్సులపై రవాణాశాఖ దాడులు నిర్వహిస్తోందన్నారు.

దసరా పర్వదినం సందర్భంగా దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాల్లో అధిక ధరలకు టిక్కెట్ విక్రయాలు జరపవద్దని సూచించారు. అధిక ధరలకు టిక్కెట్ విక్రయించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దన్నారు. ఎక్కువగా వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తామన్నారు. తనిఖీల కోసం 19 బృందాలను నియమించామన్నారు.


More Telugu News