ధోనీ ప్రపంచకప్ విన్నింగ్ సిక్స్.. వాంఖడే స్టేడియంలో రెండు సీట్లకు కొత్త లుక్

  • నాడు ధోనీ బాదిన సిక్సర్ ను మద్దాడింది ఈ రెండు సీట్లే
  • వీటికి ప్రత్యేక క్యాబిన్ తో డిజైన్ చేసిన వాంఖడే స్టేడియం
  • ఈ విడత ప్రపంచకప్ మ్యాచుల సందర్భంగా ప్రత్యేక ఆకర్షణ
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ప్రత్యేకంగా అలంకరించిన రెండు సీట్లను గమనించే ఉంటారు. 2011 ప్రపంచకప్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ సారథి ఫైనల్ లో సిక్సర్ కొట్టి భారత్ విజయాన్ని ఖరారు చేయడం గుర్తుండే ఉంటుంది. ఆ బంతి వెళ్లి రెండు సీట్లపై పడిపోయింది. ఆ రెండు సీట్లను వీక్షకులకు కేటాయించకుండా, ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. వీటిని మళ్లీ రీడిజైన్ (నవీకరణ) చేశారు. ‘వరల్డ్ కప్ 2011 విక్టర్ మెమోరియల్ స్టాండ్‘ పేరుతో ఈ రెండు సీట్లకు ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేశారు.

ప్రతి క్రికెట్ అభిమానికీ 2011 ప్రపంచకప్ లో ధోనీ కొట్టిన విన్నింగ్ షాట్ గుర్తుండే ఉంటుంది. నాడు శ్రీలంకపై భారత్ విజయం సాధించి కప్పు సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ లో ధోనీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గానూ నిలిచాడు. కేవలం 79 బంతులకు 91 పరుగులతో రెచ్చిపోయి ఆడాడు. లసిత్ మలింగ కీలకమైన సెహ్వాగ్ ను సున్నాకే, సచిన్ ను 18 పరుగులకే అవుట్ చేసి కష్టాల్లోకి నెట్టగా, గంభీర్ 97 పరుగులు (122 బంతులు), కోహ్లీ 35 పరుగులు (49 బంతులు), ధోనీ 79 పరుగులతో భారత్ ను గెలిపించారు.


More Telugu News