తక్కువ వడ్డీకే కారు లోన్ ఇస్తున్న బ్యాంకులు.. వివరాలు ఇవిగో!
- దీపావళికి కారు కొనాలనుకుంటే ఇదే మంచి అవకాశం
- జీరో ప్రాసెసింగ్ ఫీజుతో లోన్ ఇస్తున్న ఎస్బీఐ
- ఇదే బాటలో యూసీవో బ్యాంకు కూడా
వచ్చే దీపావళికి కొత్త కారును ఇంటికి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారా.. బ్యాంక్ లోన్ తో కారు కొనాలని అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం మీకోసమే! ఈ పండుగకు కార్ల షోరూంలు వినూత్న ఆఫర్లతో ఊరిస్తుండగా తక్కువ వడ్డీకే లోన్ ఇస్తామంటూ బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజు పేరుతో ఖాతాదారుల నడ్డి విరిచే సంప్రదాయానికి స్వస్తి చెబుతున్నాయి.
యూసీవో బ్యాంక్..
ఇందులో యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (యూసీవో) ముందు వరుసలో ఉంది. అతి తక్కువ వడ్డీకే కార్ లోన్ ఇస్తోంది. జీరో ప్రాసెసింగ్ ఫీజుతో ఏటా 8.45 శాతం నుంచి 10.55 శాతం వడ్డీని వసూలు చేస్తున్నట్లు బ్యాంకు తెలిపింది.
ఎస్బీఐ..
ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కూడా ఇదే బాటలో నడుస్తోంది. కార్ లోన్ కోసం కస్టమర్ల నుంచి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడంలేదని స్పష్టం చేసింది. అంతేకాదు, లోన్ పై వడ్డీ కూడా తక్కువేనని చెబుతోంది. కార్ లోన్ పై ఎస్బీఐ 8.65 శాతం నుంచి 9.70 శాతం వడ్డీ వసూలు చేస్తోంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర..
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా కార్ లోన్ పై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయడంలేదు. వార్షిక ప్రాతిపదికన 8.70 శాతం నుంచి 13 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా..
కార్ లోన్‌పై అతి తక్కువ ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొంది. కేవలం రూ.500 మాత్రమే చార్జ్ చేస్తున్నట్లు తెలిపింది. వడ్డీ విషయానికి వస్తే కార్ లోన్ పై ఏటా 8.70 శాతం నుంచి 12.10 శాతం వసూలు చేయనున్నట్లు వెల్లడించింది.