రోహిత్.. పాండ్యా బదులు వీరిని తీసుకో: హర్భజన్ 

  • గాయం కారణంగా న్యూజిలాండ్ తో మ్యాచ్ కు పాండ్యా దూరం
  • ఆరో స్థానంలో సూర్యకుమార్ లేదా ఇషాన్ ను తీసుకోవాలన్న హర్భజన్
  • శార్థూల్ ఠాకూర్ బదులు షమీతో ఆడించాలని సూచన
బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా కాలి చీలమండకు గాయం అయింది. దీంతో అతడు ఈ ఆదివారం నాడు న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉండడం లేదు. కనీసం ఏడు రోజుల విశ్రాంతి అవసరమన్నది వైద్యుల సూచన. తదుపరి మ్యాచ్ కు పాండ్యా అందుబాటులో ఉండడం లేదని బీసీసీఐ కూడా ధ్రువీకరించింది. దీంతో హార్థిక్ పాండ్యా స్థానంలో కెప్టెన్, కోచ్ ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఎవరిని తీసుకోవాలనే విషయమై టీమిండియా మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ కీలక సూచనలు చేశాడు.

హార్థిక్ పాండ్యా లేని లోటును భర్తీ చేసుకోవడం కోసం జట్టులో రెండు మార్పులు చేయాలని హర్భజన్ సింగ్ సూచించాడు. ధర్మశాల పిచ్ ఎక్కువగా స్వింగ్ అవుతుందని తెలిసిందే. దీంతో ఆఫ్ స్పిన్నర్ అయిన రవిచంద్రన్ అశ్విన్ కు బదులు సీమర్ మహమ్మద్ షమీకి అవకాశం కల్పించాలని హర్భజన్ సూచించాడు. అలాగే, 6వ స్థానంలో ఇషాన్ కిషన్ లేదా సూర్యకుమార్ యాదవ్ ను ఆడించాలని సూచన చేశాడు. ఆల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్ ను నమ్ముకోకుండా అతడి స్థానంలో మహమ్మద్ షమీని తీసుకుని, 10 ఓవర్లు ఆడించాలని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. చివరికి ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి మరి.


More Telugu News