శాకాహారులకు చాంతాడంత ‘డైట్ ప్లాన్’.. నెటిజన్ల చమత్కారాలు
- ఉదయం నుంచి రాత్రి వరకు చాలా పెద్ద మెనూ
- షేర్ చేసిన చిరాగ్ అనే ట్విట్టర్ యూజర్
- ఇలా చేయాలంటే మరో 24 గంటలు కావాలంటున్న నెటిజన్లు
మనకు ప్రొటీన్ చాలా అవసరం. ప్రొటీన్ కూడా ఉన్నప్పుడే పోషకాహారం అవుతుంది. ప్రొటీన్ తీసుకుంటే, అందులోని అమైనో యాసిడ్స్ మన కండరాలు, ఎముకల నిర్మాణానికి, కండరాల మరమ్మతులకు వీలు కల్పిస్తాయి. హార్మోన్లు, ఎంజైమ్ లను తయారు చేస్తాయి. శక్తిని కూడా ఇస్తాయి. గుడ్లు, మాంసాహారం ద్వారా ప్రొటీన్ కావాల్సినంత లభిస్తుంది. కానీ, శాకాహారులకు ప్రొటీన్ అంతగా లభించదు. వీరు తమకు తగినంత ప్రొటీన్ అందేలా చూసుకోవాలంటే, ఆహారంలో చాలా మార్పులే చేసుకోవాలి. రోజువారీ తగినంత ప్రొటీన్ కోసం తీసుకోవాల్సిన ఆహార పదార్థాల మెనూతో చిరాగ్ బర్జత్య అనే వ్యక్తి ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ మెనూ కాస్త పెద్దదిగా ఉండడంతో నెటిజన్లు దీనిపై చమత్కారాలు విసురుతున్నారు.
చిరాగ్ మెనూ..
బ్రేక్ ఫాస్ట్: 2 గ్లాసుల పాలు, 20 గ్రాముల బాదం తీసుకుంటే 20 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. 100 గ్రాములు ఉడికించని దాలియా తీసుకుంటే 12 గ్రాముల ప్రొటీన్.. వెరసి మొత్తం 32 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది.
లంచ్: 5 చపాతీలు (15 గ్రాముల ప్రొటీన్). ఉడికించని 50 గ్రాముల పప్పు (12 గ్రాముల ప్రొటీన్). అర లీటర్ మజ్జిగ (16 గ్రాముల ప్రొటీన్). కలిపి మొత్తం 43 గ్రాముల ప్రొటీన్.
స్నాక్: 5 చపాతీలు (15 గ్రాముల ప్రొటీన్), 200 ఎంఎల్ పాలతో 14 గ్రాముల ప్రొటీన్. మొత్తం 29 గ్రాముల ప్రొటీన్.
డిన్నర్:5 చపాతీలు (15 గ్రాముల ప్రొటీన్), 100 గ్రాముల పనీర్ తో 18 గ్రాముల ప్రొటీన్. 50 గ్రాముల ఉడికించని పప్పుతో 12 గ్రాములు, అర లీటర్ పాలతో 16 గ్రాములు.. వెరసి మొత్తం మీద 61 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది.
ఈ ఆహారానికి తోడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేయాల్సిన వ్యాయామాలను కూడా సూచించారు. ఉదయం 5 కిలోమీటర్ల నడక, 100 పుషప్ లు ఇందులో భాగంగా ఉన్నాయి.
దీనికి పోన్ సప్డి అనే యూజర్ స్పందిస్తూ.. ‘‘ఈ తరహా డైట్ రోజువారీ అంటే వర్కవుట్ చేస్తేనే అవుతుంది. రోజంతా వండడం, తినడమే సరిపోతుంది. రోజువారీ మనకున్న పనులతో అసలు ఇది సాధ్యపడుతుందా అని నా అనుమానం’’ అని ట్వీట్ చేశారు. ఇవన్నీ చేయాలంటే మనకు రోజులో మరో 24 గంటల సమయం కావాలంటూ కీర్తి అనే యూజర్ కామెంట్ చేశారు. అతుల్ శర్మ అనే యూజర్ స్పందిస్తూ రోజులో ఇంత తినడం అసాధ్యమన్నారు. ఈ తరహా మెనూ పాటిస్తే రోజంతా అయిపోతుందని, ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ కే ఇది సాధ్యపడుతుందన్నారు. భాయ్ కాస్త సాధ్యమయ్యేది చెప్పవూ అని మరో యూజర్ కామెంట్ చేయడం గమనార్హం.