రోహిత్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్.. ఎందుకంటే..!
- ‘కలిసికట్టు’గా క్యాప్షన్ ఇచ్చిన హిట్‌మ్యాన్
- ఆటగాళ్ల మధ్య సానుకూల వాతావరణాన్ని తెలియజేస్తున్న ఫొటోలు
- డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల మధ్య స్నేహానికి సంకేతం
సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ 2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆటగాళ్లందరూ చక్కటి ఫామ్‌లో ఉండడం ఒక అంశమైతే.. డ్రెసింగ్ రూమ్‌లో ఆటగాళ్ల మధ్య సానుకూల వాతావరణం మరో బలంగా కనిపిస్తోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన రెండు ఫొటోలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. బంగ్లాదేశ్‌పై మ్యాచ్ ముగించిన అనంతరం బ్యాట్స్‌మెన్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ను తాను అప్యాయంగా హత్తుకున్న ఫొటోను రోహిత్ పంచుకున్నాడు. దీనికి ‘కలిసికట్టుగా’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్ల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని చాటిచెప్పే మరో ఫొటోని కూడా హిట్‌మ్యాన్ పంచుకున్నాడు. వికెట్ పడిన ఆనందంలో ఆటగాళ్లు ఆప్యాయంగా ఆలింగనాలు చేసుకొని అభినందించుకోవడం, వీరిని రోహిత్ శర్మ ప్రోత్సహించడం ఇందులో కనిపించాయి. రోహిత్ షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. గెలుపోటముల మాట పక్కన పెడితే ఆటగాళ్ల మధ్య ఇలాంటి సానుకూల వాతావరణం ఎంతో అవసరమని మాజీల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ వరకు అభిలషిస్తున్నారు.
కాగా బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ సెంచరీ నమోదు చేయగా మరో ఎండ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ చక్కటి సహకారం అందించాడు. రాహుల్ కూడా పరుగులు రాబడితే కోహ్లీ సెంచరీ చేసే అవకాశం ఉండదనే విషయాన్ని గ్రహించి కోహ్లీకి స్ట్రయికింగ్ ఇచ్చేలా సహకరించాడు. దీంతో ఒకే సిక్సర్‌తో ఇటు సెంచరీతోపాటు జట్టుకు విజయాన్ని కూడా విరాట్ కోహ్లీ అందించిన విషయం తెలిసిందే. ఇక మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది.