5 సెకన్ల ముందు నిలిచిపోయిన గగన్‌యాన్ ప్రయోగం.. కారణాన్ని వెల్లడించిన ఇస్రో
- నిలిచిపోయిన టీవీ-డీ1 ప్రయోగం
- ఇంజన్ జ్వలన ప్రక్రియలో క్రమరాహిత్యం
- 5 సెకన్ల ముందు నిలిపివేసిన ఆన్‌బోర్డ్ కంప్యూటర్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్‌యాన్ ప్రాజెక్ట్‌లో భాగంగా శనివారం(అక్టోబర్ 21) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జరగాల్సిన ‘టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్’ (టీవీ-డీ1) నిలిచిపోయింది. ఇంజన్ జ్వలన (ఇగ్నిషన్) ప్రక్రియ సక్రమంగా జరగకపోవడంతో ప్రయోగానికి కొన్ని సెకన్ల ముందు ప్రయోగం నిలిచిపోవడం అనివార్యమైంది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. క్రమరాహిత్యం కారణంగా ఆన్‌బోర్డ్ కంప్యూటర్ ప్రయోగాన్ని నిలిపివేసిందని ఎస్.సోమనాథ్ వివరించారు.
ఈ లోపానికి కారణాన్ని విశ్లేషించుకుని తిరిగి ప్రయోగాన్ని చేపడతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా ఉదయం 8 గంటలకు జరగాల్సిన ప్రయోగాన్ని తొలుత అరగంటపాటు వాయిదా వేశారు. ఆ తర్వాత ఆటోమేటిక్ లాంచ్ సీక్వెన్స్‌కు 8.45 గంటలకు షెడ్యూల్ చేశారు. చివరికి ప్రయోగానికి కేవలం 5 సెకన్ల ముందు ప్రయోగాన్ని నిలిపివేస్తూ ఇస్రో శాస్త్రేవేత్తలు నిర్ణయం తీసుకున్నారు. ఇంజిన్ ఇగ్నిషన్ సాధారణంగా జరగాల్సి ఉంది. కానీ ఏం తప్పు జరిగిందో తేల్చాల్సి ఉందని సోమనాథ్ చెప్పారు. వాహనాన్ని కలిగి ఉన్న ఆటోమేటిక్ లాంచ్ సీక్వెన్స్‌ను ప్రేరేపించిన వాటిని విశ్లేషించిన తర్వాత తిరిగి ప్రయోగిస్తామన్నారు. ప్రయోగ వాహకం సురక్షితంగానే ఉందని, అతిత్వరలో ప్రయోగాన్ని షెడ్యూల్ చేస్తామన్నారు.