హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్‌లో అర్ధరాత్రి రభస..టిక్కెట్టు డబ్బులు తిరిగిచ్చేసిన యాజమాన్యం
- శుక్రవారం రాత్రి ‘గణ్‌పత్’ సినిమా ప్రదర్శిస్తుండగా అకస్మాత్తుగా వెలువడిన దుర్వాసన
- సిబ్బంది స్ప్రే చేసినా మెరుగుపడని పరిస్థితి
- అరగంటకు పైగా వేచి చూసి నిరసనకు దిగిన ప్రేక్షకులు, పోలీసుల ఎంట్రీ
- టిక్కెట్టు డబ్బులు తిరిగిచ్చేయడంతో సద్దుమణిగిన పరిస్థితి
హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్ థియేటర్‌లో శుక్రవారం రాత్రి నానా రభస జరిగింది. టైగర్ ష్రాఫ్ నటించిన గణ్‌పత్ సినిమా ప్రదర్శిస్తుండగా థియేటర్లో అకస్మాత్తుగా దుర్వాసన వెలువడటంతో ప్రేక్షకులు ఇబ్బందుల పాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన థియేటర్ సిబ్బంది అక్కడ స్ప్రే చేసినా పరిస్థితి మెరుగుపడలేదు.
ఈ క్రమంలో సుమారు అరగంట పాటు వేచి చూసిన ప్రేక్షకులు చివరకు సహనం కోల్పోయి నిరసనకు దిగారు. అందరూ బయటకు వచ్చి టిక్కెట్టు డబ్బులు తిరిగివ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. చివరకు థియేటర్ యాజమాన్యం టిక్కెట్ డబ్బులు తిరిగివ్వడంతో ప్రేక్షకులు వెనుదిరిగారు.