ఎక్స్ ప్రెస్ వే... సత్వర బ్యాంకింగ్ సేవల కోసం హెచ్ డీఎఫ్ సీ సరికొత్త ప్లాట్ ఫాం

  • ఖాతాదారులకు మెరుగైన సేవల కోసం హెచ్ డీఎఫ్ సీ 'ఎక్స్ ప్రెస్ వే' 
  • డిజిటల్ విధానంలో బ్యాంకింగ్ సేవలు
  • కొత్త కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంటుందన్న హెచ్ డీఎఫ్ సీ
లాభాల బాటలో పయనిస్తున్న దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఖాతాదారుల సేవల కోసం కొత్త వేదికను తీసుకువచ్చింది. దీని పేరు 'ఎక్స్ ప్రెస్ వే'. పేరుకు తగ్గట్టుగానే వేగవంతమైన బ్యాంకింగ్ సేవలు, బ్యాంకింగ్ ఉత్పాదనలకు సంబంధించిన సేవలు పొందేందుకు ఈ 'ఎక్స్ ప్రెస్ వే' ఉపయోగపడుతుంది. 

ఇది ఒక డిజిటల్ ప్లాట్ ఫాం. ఇందుకోసం కాగితాలపై దరఖాస్తు చేసుకోవడాలు, ఎలాంటి ఫారాలు నింపడాలు ఉండవు. అంతా డిజిటల్ విధానంలోనే ఈ వేదిక ద్వారా సేవలు అందుకోవచ్చు. వ్యక్తిగత రుణాలు, వ్యాపార రుణాలు, వాహన రుణాలు, సేవింగ్స్ అకౌంట్, క్రెడిట్ కార్డు సేవలను 'ఎక్స్ ప్రెస్ వే' డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా త్వరితగతిన పొందవచ్చు. 

కొత్త ఖాతాదారులకు కూడా ఇది అందుబాటులోకి వస్తుందని హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఓ ప్రకటనలో వెల్లడించింది.


More Telugu News