హైదరాబాద్ క్రికెట్ సంఘానికి నూతన అధ్యక్షుడు... ఎన్నికల్లో జగన్మోహన్ రావు విజయం
- నేడు హైదరాబాద్ క్రికెట్ సంఘానికి ఎన్నికలు
- హెచ్ సీఏలో మొత్తం సభ్యుల సంఖ్య 173
- 169 మంది ఓటు హక్కు వినియోగించుకున్న వైనం
- రెండు ఓట్లతో అమర్ నాథ్ పై నెగ్గిన జగన్మోహన్ రావు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)కు కొత్త అధ్యక్షుడు వచ్చారు. ఇవాళ జరిగిన హెచ్ సీఏ ఎన్నికల్లో జగన్మోహన్ రావు విజయం సాధించారు. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్ సీఏ ప్యానెల్ తరఫున అధ్యక్ష పదవికి పోటీ పడిన జగన్మోహన్ రావు... తన ప్రత్యర్థి అమర్ నాథ్ పై 2 ఓట్ల తేడాతో నెగ్గారు.
ఇవాళ ఉప్పల్ స్టేడియంలో హెచ్ సీఏ ఎన్నికలు చేపట్టారు. హెచ్ సీఏ సభ్యుల సంఖ్య 173 కాగా, 169 మంది ఓటు వేశారు. మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, వెంకటపతిరాజు, మిథాలీ రాజ్, ప్రజ్ఞాన్ ఓజా, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నవారిలో ఉన్నారు.
హెచ్ సీఏ ఎన్నికల్లో నెగ్గిన నూతన కార్యవర్గం ఇదే...
జగన్మోహన్ రావు- అధ్యక్షుడు (యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్ సీఏ ప్యానెల్)
దల్జీత్ సింగ్- ఉపాధ్యక్షుడు (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్)
దేవరాజు- కార్యదర్శి (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్)
బసవరాజు- సంయుక్త కార్యదర్శి (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్)
సీజే శ్రీనివాసరావు- ట్రెజరర్ (యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్ సీఏ ప్యానెల్)
కౌన్సిలర్- సునీల్ అగర్వాల్ (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్)