మా సినిమాలో తప్పును పట్టుకున్నారు... హేట్సాఫ్: అనిల్ రావిపూడి
- బాలకృష్ణ, రావిపూడి కాంబోలో భగవంత్ కేసరి
- అక్టోబరు 19న రిలీజైన చిత్రం
- తొలి రోజే హిట్ టాక్
- నేడు హైదరాబాదులో సక్సెస్ మీట్
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన భగవంత్ కేసరి చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తొలిరోజే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో, భగవంత్ కేసరి చిత్రబృందం నేడు హైదరాబాదులో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు అనిల్ రావిపూడి, శ్రీలీల, నిర్మాత సాహు గారపాటి, గీత రచయిత అనంత శ్రీరామ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఓ పాత్రికేయుడు భగవంత్ కేసరి చిత్రంలో చిన్న తప్పు ఉందని ఎత్తిచూపారు. సినిమాలో జైలర్ (శరత్ కుమార్) చనిపోతే సీఐ చనిపోయారు అంటూ బ్రేకింగ్ న్యూస్ చూపించారని సదరు పాత్రికేయుడు వివరించారు. దాంతో, అనిల్ రావిపూడి ఎంతో ఆశ్చర్యపోయారు.
మీ సునిశిత పరిశీలనకు, మీ సూక్ష్మబుద్ధికి... అంతపెద్ద కమర్షియల్ సినిమాలో మీరు తప్పును పట్టుకున్నందుకు నిజంగా హేట్సాఫ్ అంటూ ఆ సినీ జర్నలిస్టును అభినందించారు. అంతేకాదు, అది తప్పేనని ఒప్పుకుంటున్నామని, తప్పు కాబట్టి క్షమాపణలు చెబుతున్నానని అనిల్ రావిపూడి సభాముఖంగా ప్రకటించారు.