మనది పేగు బంధం.. వాళ్లది ఎన్నికల బంధం: కవిత
- కాంగ్రెస్ పార్టీపై కవిత విమర్శలు
- 1969లో ఉద్యమకారులపై ఇందిరాగాంధీ ప్రభుత్వం కాల్పులు జరిపిందని మండిపాటు
- అంజయ్యను రాజీవ్ అవమానించారని విమర్శ
కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. తెలంగాణతో ఆ పార్టీకి ఎన్నికల బంధం తప్పితే మరేమీ లేదని ఆమె అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణకు పేగు బంధం ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజలు పేగు బంధాన్నే ఆదరిస్తారని అన్నారు. నిజామాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న వారిపై 1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం కాల్పులు జరిపిందని మండిపడ్డారు. ఆ కాల్పుల్లో 369 మంది అమరులయ్యారని చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణకు చెందిన అప్పటి సీఎం అంజయ్యను హైదరాబాద్ విమానాశ్రయంలో రాజీవ్ గాంధీ అవమానించారని విమర్శించారు. తెలంగాణను ఇస్తున్నామని 2009లో సోనియాగాంధీ ప్రకటించి వెనకడుకు వేశారని... దీని కారణంగా వందలాది మంది అమరులయ్యారని చెప్పారు. కాంగ్రెస్ చేసిన ద్రోహాలను తెలుసుకుని రాహుల్ మాట్లాడితే బాగుంటుందని అన్నారు.