రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్
- ఆర్మూరు సభలో కాంగ్రెస్ లో చేరిన రేఖా నాయక్
- నేటితో ముగిసిన రాహుల్ బస్సు యాత్ర
- రాత్రికి ఢిల్లీకి తిరిగి వెళ్లనున్న రాహుల్
బీఆర్ఎస్ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రేఖా నాయక్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్ ను ఇవ్వని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర నిరాశకు గురైన రేఖ బీఆర్ఎస్ ను వీడారు.
మరోవైపు, రాహుల్ చేపట్టిన మూడు రోజుల బస్సు యాత్ర ఈరోజు ఆర్మూరు సభతో ముగిసింది. ఈ సభలో రేఖా నాయక్ కాంగ్రెస్ లో చేరారు. ఈ నెల 18న రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ బస్సు యాత్రను ప్రారంభించారు. రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం యాత్రను చేపట్టారు. ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, చొప్పదండి, ఆర్మూర్ నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగింది. ఈ రాత్రి రాహుల్ ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.