ఎన్నికల్లో తమకు ఎన్ని స్థానాలు వస్తాయో అంచనాలు వెలువరించిన సీఎం కేసీఆర్
- గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తలతో కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం
- బీఆర్ఎస్ విజయంపై ఎలాంటి డౌట్ లేదని ధీమా
- కామారెడ్డిలో కూడా తాను పోటీ చేయడానికి ఓ కారణం ఉందని వ్యాఖ్యలు
- గజ్వేల్ ను వదిలి వెళ్లబోనని స్పష్టీకరణ
సీఎం కేసీఆర్ ఇవాళ సొంత నియోజకవర్గం గజ్వేల్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలవబోతోందో తమ అంచనాలు వెల్లడించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో తనకు తెలిసినంతవరకు బీఆర్ఎస్ కు 95 నుంచి 105 స్థానాలు వస్తాయని తెలిపారు. అందులో ఎలాంటి సందేహం లేదని, ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు.
ఓ కారణంతోనే తాను ఈసారి కామారెడ్డిలో పోటీ చేస్తున్నానని, అయితే గజ్వేల్ ను వదిలిపెట్టి వెళ్లబోనని స్పష్టం చేశారు. రాష్ట్రానికి తలమానికంగా ఉండేలా గజ్వేల్ ను అభివృద్ధి చేసే బాధ్యత నాది అని ఉద్ఘాటించారు. కాగా, గజ్వేల్ లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఓ సెంటిమెంటుగా వస్తోందని సీఎం కేసీఆర్ వివరించారు.